హీరోయిన్లకు ఎన్నో సమస్యలున్నాయి : పూనమ్ కౌర్

  • July 24, 2018 / 05:58 AM IST

అందం, అభినయ ప్రతిభ ఎంత ఉన్నప్పటికీ అదృష్టం తోడులేకుంటే రంగులలోకంలో విజయం సాధించలేరు. అందుకు ఎంతోమంది హీరోయిన్లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అవకాశాలు లేకపోయినా నటనపై ఆసక్తితో పరిశ్రమలో కొనసాగుతున్న అటువంటి నటి పూనమ్ కౌర్. మాయ జాలం, ఒక విచిత్రం, వినాయకుడు, గగనం వంటి చిత్రాల్లో నటించిన ఈమె తన నటనతో మంచి మార్కులే అందుకుంది. కానీ స్టార్ సినిమాలో లీడ్ రోల్ సాధించుకోలేకపోయింది. అందుకే వెండితెరను వీడి బుల్లితెర పంచన చేరింది. బాహుబలి నిర్మాతల్లో ఒకరైన దేవినేని ప్రసాద్  అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన స్వర్ణ ఖడ్గం అనే సీరియల్ ల్లో మహారాణిగా నటిస్తోంది.

ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “హీరోయిన్ల‌కు కాస్టింగ్ కౌచ్ ఒక్కటే సమస్య కాదు. ఇంకా చాలా అంశాలు హీరోయిన్ల‌ను వేధిస్తుంటాయి. హీరోయిన్లు త‌మ మ‌న‌సుకు న‌చ్చిన చాలా పనులు చేయ‌లేరు. హీరోలు పెళ్లి గురించి ఆలోచ‌న రాగానే చ‌క్క‌గా పెళ్లి చేసుకుంటారు. కానీ, హీరోయిన్ల‌కు అలా కుద‌ర‌దు. పెళ్లి త‌ర్వాత అవ‌కాశాలు త‌గ్గిపోతాయ‌నే భ‌యంతో త‌గిన వ‌య‌సులో పెళ్లి చేసుకోలేరు. కెరీర్‌ను కాపాడుకోవ‌డం కోసం పెళ్లికి దూర‌మైపోతారు. రంగులో ప్రపంచంలో క‌ల‌ర్‌ఫుల్‌గా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ హీరోయిన్ల‌ జీవితం అంత సంతోషంగా ఉండదు” అని పూనమ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus