పవన్ కళ్యాణ్ మాటలకు కౌంటర్ వేసిన పూనమ్ కౌర్!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి నటి పూనమ్ కౌర్ కి మంచి స్నేహం ఉంది. కొన్నేళ్ల క్రితం ఆమె మానసికంగా కుంగిపోయినప్పుడు పవన్ ఆమెకు అండగా నిలిచారు. వీరిద్దరి మధ్య అనుబంధాన్ని క్రిటిక్ కత్తి మహేష్ విమర్శించడంతో వార్తల్లో నిలిచింది. ఈరోజు మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ గా మారింది. నిన్న గుంటూరులో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ తెలుగు దేశం పార్టీ నాయకులపై విమర్శలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పై పవన్ చేసిన కామెంట్లు చర్చనీయాంశమైంది. రెండు రాష్ట్రాల నేతలు పవన్ ప్రసంగం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇటువంటి సమయంలో పూనమ్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో పవన్ పై  సెటైర్లు వేసింది. ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ పోస్ట్ లో పూనమ్ ఏమి చెప్పిందంటే.. “బట్టలను మార్చినట్టు కొంతమంది మనసులు మారుస్తూ.. మాట మీద నిలబడకుండా.. అమాయకజనాలతో గేమ్స్ ఆడుతున్నారు. కాన్సెప్ట్ లు, డైలాగులు కాపీ కొట్టి జనాలను మభ్యపెడుతున్నారు” అని పోస్ట్ చేసింది. పేరు చెప్పకుండా పవన్ ని టార్గెట్ చేసినట్టు ఈ పోస్ట్ చెప్పకనే చెబుతోంది. అయితే పవన్ ని అభిమానించే ఈమె.. ఆ పోస్ట్ ఎందుకు పోస్ట్ చేసిందోనని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. పూనమ్ స్నేహితులు మాత్రం.. ఈ పోస్ట్ ఆమె చేసి ఉండదని పూర్తి నమ్మకంతో చెబుతున్నారు. దీనిపై పూనమ్ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus