తాను ఎదుగుతూ.. తన తోటి వారిని ఎదగనిచ్చే తత్వం ఒక్కోసారి మొక్కలే ఫాలో అవ్వవు.. ఇక తొక్కలో మనుషుల సంగతి ప్రత్యేకంగా చెప్పాలా.. సాయం చేయకపోయినా పర్లేదు కానీ.. కుదిరితే ఓ నలుగురి జీవితాలు నాశనం చేసేద్దామని చూస్తారు కొందరు, అన్నీ ఇండస్ట్రీల్లో ఇలాంటి వారు ఉంటారు కానీ.. మన తెలుగు చిత్రసీమలో ఈ శైలి వ్యక్తులు కాస్త ఎక్కువమంది ఉంటారు. ఈ విషయాన్ని మరోమారు కాస్త గట్టిగా.. ఎమోషనల్ గా చెప్పారు పోసాని కృష్ణమురళి. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చేప్పే మనస్తత్వం కలిగిన పోసాని నిన్న జరిగిన “ఉంగరాల రాంబాబు” ట్రైలర్ లాంచ్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చారు.
ఆ సమయంలో ట్రైలర్ లోని “మనిషిలో మానవత్సం లేకపోవడం” అనే డైలాగ్ కు బాగా కనెక్ట్ అయిన పోసాని.. స్టేజ్ మీదకి వచ్చి మరీ “ఇటీవలే ఓ వ్యక్తి నాకు, అలీకి వెన్నుపోటు పొడిచాడు, తమకు రావాల్సిన ఒక సినిమా ఆఫర్ ను దగ్గరుండి మరీ తమను తప్పించి వేరే వాళ్ళని పెట్టించాడు ఆ వ్యక్తి”. 32 ఏళ్ళ క్రితం అవకాశాల్లేక, తినడానికి తిండి కూడా లేక ఎలా ఫీల్ అయ్యానో.. ఈ విషయం అలీ నాకు చెప్పినప్పుడు కూడా అంతే కోపంగా ఫీలయ్యానని పోసాని చెప్పడం గమనార్హం. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరాయ్యుంటారబ్బా.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.