స్టార్ హీరోల ప్రవర్తన గురించి చెప్పిన పోసాని కృష్ణ మురళి

  • August 30, 2017 / 10:05 AM IST

నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తన వ్యాఖ్యలతో మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. స్టార్ హీరోల ప్రవర్తన గురించి చెప్పి హాట్ టాపిక్ గా మారారు. ఓ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ… “మహేష్ బాబు హీరో కృష్ణ గారు ఎలా ఉంటారో? అలాంటి ప్రవర్తనే మహేష్ బాబులో కనిపిస్తుంది. ఎవరి గురించి బ్యాడ్ గా మాట్లాడడు, పక్కోడు నాశనం కావాలనికోరుకోడు. మహేష్ బాబు అహంకారంగా మాట్లాడటం నేను ఎప్పుడూ చూడలేదు” అని చెప్పారు. ఇంకా మహేష్ గురించి .. ” నేనే రాజు అనే ఫీలింగుతో మహేష్ బాబు సెట్లోకి ఎప్పుడూ రాలేదు. నేనొస్తే ఎదుటోడు లేచి నిలబడాలి అనుకోడు.

ఒక ఆర్టిస్టు ఎలా ఉంటాడో, అలాగే ఒక కుర్చీ వేసుకుని మూలన కూర్చుంటాడు. తన ఎదుట జూనియర్ ఆర్టిస్టు కూర్చున్నా పట్టించుకోడు. గుడ్ బాయ్” అని ప్రశంసించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ “ఎన్టీఆర్‌కు అహంకారం ఉండదు. నేను బాగా యాక్ట్ చేస్తే వచ్చి గట్టిగా వాటేసుకుంటాడు. బాగా చేయలేదు అంటే…. అన్నా నువ్వు ఇలాగ చేస్తే బావుంటుంది అని చెబుతాడు” అని పోసాని తారక్ లోని మంచి తనాన్ని బయటపెట్టారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus