రియాలిటీ షోలపై పోసాని కృష్ణమురళి కామెంట్

  • July 18, 2017 / 08:10 AM IST

ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి అనేక విషయాలపై తనదైన శైలిలో మాట్లాడుతుంటారు. అతని ముక్కుసూటితనం వల్ల పలుమార్లు వార్తల్లో కెక్కారు. ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. టీవీల్లో వచ్చే రియాలిటీ షోలలో రియల్ ఉండదని సంచలన కామెంట్స్ చేశారు. ఈ మధ్య అన్ని ఛానళ్ల వారు కుటుంబ కలహాలను తీర్చడానికి కొన్ని వేదికలను ఏర్పాటు చేశాయి. లాయర్, మానసిక నిపుణుల సమక్షంలో విడిపోయిన భార్య భర్తలను కలపడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇటువంటి షోలలలో ఒక దానికి పోసాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. దగ్గరినుండి అక్కడ జరిగే సంగతులు చూసారు. వాటిని మీడియా ముఖంగా బయట పెట్టారు.

షో కి వచ్చే వారిలో అందరూ నిజంగా గొడవపడిన దంపతులు కాదని, కొంతమంది పేమెంట్ తీసుకొని గొడవపడే భార్య భర్తలు కూడా ఉంటారని బాంబ్ పేల్చారు. తాను హోస్ట్ గా పాల్గొనే షో వివరాలను కూడా బయట పెట్టడం.. ఎంత వరకు మంచిది? అని కొంతమంది ప్రశ్నిస్తుంటే.. మరికొంతమంది మాత్రం అసలు అతను నిజమే చెబుతున్నాడని గ్యారంటీ ఏమిటని సందేహం వ్యక్తం చేస్తున్నారు. పోసాని అభిమానులు మాత్రం .. అతను మీడియా ముందు మాట్లాడడం తగ్గిస్తే మంచిదని కోరుకుంటున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus