“మళ్ళీ రావా”తో మంచి విజయం అందుకోనున్నాడా!

Advertisement

ఒక్కోసారి హీరో బ్యాగ్రౌండ్, మునుపటి సినిమాల సక్సెస్ ట్రాక్ తో సంబంధం లేకుండా “ఆ హీరోకి మంచి హిట్ పడితే బాగుండు” అనుకోంటుంటాం. అలాంటి అతితక్కువ హీరోల్లో సుమంత్ ఒకడు. మహేష్ బాబుకు క్లోజ్ ఫ్రెండ్ అవ్వడంతోపాటు మెగా ఫ్యామిలీకి కూడా ఇష్టుడైన సుమంత్ అంటే అందరికీ అభిమానమే. కానీ.. సరైన సక్సెస్ లేక స్టార్ డమ్ కి దాదాపుగా దూరమైపోయాడు సుమంత్. అప్పుడెప్పుడో వచ్చిన “గోదావరి”, మొన్నామధ్య వచ్చిన “గోల్కొండ హై స్కూల్” తప్పితే సుమంత్ కు సరైన విజయం దక్కి ఏళ్ళవుతోంది. ఈమధ్యలో మనోడు చేసిన సినిమాల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కానీ.. కథ-కథనాలు బాలేక సదరు సినిమాలు పరాజయం పాలయ్యాయి. అయితే.. మళ్ళీ ఇన్నాళ్ళకి సుమంత్ మళ్ళీ మంచి హిట్ కొట్టేలా ఉన్నాడు.

గౌతమ్ అనే యువప్రతిభాశాలి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలెట్టారో కూడా తెలియదు కానీ అప్పుడే రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఓ యువకుడి జీవితం చుట్టూ తిరుగుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి కన్ఫ్యూజన్ కారణంగా తనను దూరం చేసుకొన్నప్పటికీ.. ఆమె కోసమే ఎదురుచూసే ఓ స్వచ్చమైన ప్రేమికుడిగా సుమంత్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. మాస్ రోల్స్ లో నటించమంటే కాస్త తడబడతాడేమో కానీ.. డిప్లొమేటిక్ రోల్స్ చేయమంటే సుమంత్ ను బీట్ చేసేవారెవరూ లేరు. సో, సుమంత్ మళ్ళీ సైలెంట్ గా మరో సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus