అత్తారింటికి దారేదిలో “కాటమరాయుడా” అనే పాట సూపర్ హిట్ అయింది. దీనిని స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆలపించడంతో అభిమానుల ఫేవరేట్ పాట అయింది. ఆ సాంగ్ లోని కాటమరాయుడు అనే పదాన్ని టైటిల్ గా పెట్టి పవన్ సినిమా చేస్తున్నారు. డాలీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో పవర్ స్టార్ తొలి సారిగా ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించనున్నారు. ఆయన రాయలసీమపై యాసలో పలికే డైలాగులు సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. ఫైట్స్ ఓ రేంజ్ లో ఉంటాయని గతనెల రిలీజ్ అయిన టీజర్ స్పష్టం చేసింది. ఈ మూవీలో మరో హైలెట్ అయ్యే మరో అంశం బయటికి వచ్చింది.
కాటమరాయుడు టైటిల్ సాంగ్ కోసం రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించగా… అందుకు అనూప్ రూబెన్స్ హుషారునిచ్చే సంగీతాన్ని సమకూర్చారని తెలిసింది. ఈ పాటను ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి డిజైన్ చేసిన భారీ సెట్లో సుమారు 400 మంది డ్యాన్సర్లతో తెరకెక్కించినట్లు సమాచారం. పవన్ కి జోడీగా శృతి హాసన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా ఈనెల 24 న రిలీజ్ చేయాలనీ నిర్మాత శరత్ మరార్ సన్నాహాలు చేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.