ఆ హీరో వెనుక “పవర్” ఉంది!!

సహజంగా ఏ ఇండస్ట్రీ లో అయినా… ఒక హీరో ఇంకొక హీరోకి కాంపిటేషన్ అవుతాడే కానీ…కలసి రాడు అంటారు…అలాంటిది మన పవర్ స్టార్ తెలుగులో ఉన్న ఒక ప్రముఖ హీరోకి బాగా కలసి వస్తున్నాడు…విషయంలోకి వెళితే…గోపీచంద్…ఈ హీరో గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…టాలీవుడ్ అందమైన హీరోల్లో ఈ హీరో ఒకరు అని సెపరేట్ ఇంట్రొడక్షన్ అవసరం లేదు…కాకపోతే కొందరికి ఉన్నట్లు ఈయనకు పెద్దగా బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం వల్ల…సేల్ కావడం కాస్త కష్టంగా కనిపిస్తుంది…ఇదిలా ఉంటే….వరుస పరాజయాలు పలుకరిస్తున్నప్పటికీ….ఇమేజ్ ని మెరుగు పరుచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ప్రస్తుతం మూడు సినిమాలలో నటిస్తూ ఎదో ఒక సినిమా అయినా తన అదృష్టం తిప్పక పోతుందా అన్న ఆశలతో రోజులు గడుపుతున్నాడు ఈ కుర్ర హీరో…అందులో ఈ హీరో బి. గోపాల్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు..ఇక ఆ సినిమాపై పవన్ పాటలోని ఒక లైన్ ని అదే ‘ఆరడుగుల బుల్లెట్‌’ అనే పదాన్ని టైటిల్‌ గా ఫిక్స్ చేశారు… అదేవిధంగా రెండో..సినిమా ఏంటి అంటే…సంపత్ నంది దర్శకత్వంలో నటిస్తున్న సినిమా…ఇక ఈ సినిమాకు ఏకంగా…పవన్ పాత్ర పేరు ‘గౌతమ్ నంద’ అనే పేరునే టైటిల్ గా పెట్టుకున్నాడు ఈ కుర్ర హీరో.

అయితే ఈ టైటిల్ నే ఎందుకు అంటే….ఈ టైటిల్ తో తనకు ‘అత్తారింటికి దారేది’ మూవీతో పవన్ కు వచ్చిన క్రేజ్ లో కనీసం ఒక పావు వంతు అయినా రాక పోతుందా అన్న ఆశతో అంట. ఇక ఈ రెండు సినిమాల మాట పక్కన పెడితే…మూడో సినిమా విషయంలోని పవన్ నే నమ్ముకున్నాడు ఈ కుర్ర హీరో…..గోపీచంద్ ‘ఆక్సిజన్‌’ చిత్రానికి నిర్మాత ఎ.ఎం. రత్నం. ఈ చిత్ర నిర్మాత ప్రస్తుతం ఆర్ధిక సమస్యలలో చిక్కుకున్నాడు అన్న వార్తలు ఉన్నాయి. దీనితో  ‘ఆక్సిజన్’ విడుదలకి లైన్‌ క్లియర్‌ అవ్వాలంటే పవన్‌తో ఎ.ఎం.రత్నం తీయబోతున్న సినిమా పట్టాలు ఎక్కాలి. అంటే ఒకరకంగా చెప్పాలి అంటే గోపించంద్ వెనుక తెలియని “పవర్” ఒకటి పవన్ రూపంలో దాగుంది అన్న మాట…అదే మ్యాటరు!!


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus