ప్రభాస్.. స్టూడెంట్ గా అదరగొడతాడంట..!

‘బాహుబలి’ చిత్రంతో జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటే కనీసం మూడు, నాలుగు భాషల్లో విడుదలవ్వాల్సిందే… అనడంలో సందేహం లేదు. ప్రభాస్ ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సాహూ’ చిత్రంతో పాటు… ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణకుమార్’ డైరెక్షన్లో తన 20 వ చిత్రంలో కూడా నటిస్తున్నాడు ప్రభాస్ . ఇక ‘సాహూ’ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ‘సాహూ’ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ ప్రమోద్ లు నిర్మిస్తున్నారు..!

ఇక ‘ప్రభాస్ 20’ వ చిత్రాన్ని ‘ గోపీకృష్ణ మూవీస్’ తో పాటు ‘యూవీ క్రియేషన్స్’ కూడా కలిసి నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. 1960 ల జరిగే ఓ ప్రేమకథగా… లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ చాలా బరువు కూడా తగ్గాడట. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ వింటేజ్ కార్ లను ఇష్టపడే వ్యక్తిగానూ …. స్టూడెంట్‌గానూ కనిపించబోతున్నాడని సమాచారం. ప్రభాస్ స్టూడెంట్‌గా కనిపించినంత సేపూ ఫ్యాన్స్ ఖుషీ అయ్యే సీన్లు ఎన్నో ఈ చిత్రంలో ఉండబోతున్నాయట. ఈ చిత్రం కచ్చితంగా ఆకట్టుకుంటుందని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus