పెళ్లి గురించి స్పష్టంగా చెప్పిన ప్రభాస్!

  • June 18, 2018 / 03:59 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలోని సీనియర్ బ్యాచిలర్స్ జాబితాలో ప్రభాస్ పేరు ఫస్ట్ ఉంటుంది. ముప్ఫై ఎనిమిదేళ్ల    ఈ యంగ్ రెబల్ స్టార్ ని పెళ్లి ఎప్పుడు? అని ఎంతో మంది.. ఎన్నో సార్లు అడిగినా నవ్వుతూ సమాధానాన్ని  దాటవేసేవారు. బాహుబలి సినిమా తర్వాత జాతీయ మీడియా సైతం ప్రభాస్ పెళ్లిపై దృష్టి పెట్టింది. రోజుకో కథనాన్ని ప్రచురిస్తోంది. ఆన్ స్క్రీన్ పై బెస్ట్ కపుల్ గా పేరుతెచ్చుకున్న ప్రభాస్, అనుష్క కి నిశ్చితార్ధం జరిగిపోయిందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని తాజాగా ఓ జాతీయ మీడియా ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే తన పెళ్లి విషయంలో అనేక సార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ.. మళ్ళీ ఈసారి కూడా ప్రభాస్ నోరు మెదపక తప్పలేదు.  “నా పెళ్లి ఎవరితో అనేది నా పర్సనల్. దాని గురించి పబ్లిక్ గా చెప్పడం నాకు ఇష్టం లేదు.

అయితే వివాహం నిశ్చయమయ్యాక మాత్రం మీడియాకు కచ్చితంగా చెబుతాను” అని ప్రభాస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ మూవీ భారీ షెడ్యూల్ రీసెంట్ గా దుబాయి లోని అబుదాబిలో ముగించుకుంది. సినిమాలో ఎనిమిది నిముషాలు ఉండే ఈ యాక్షన్ సీక్వెన్స్ కి 70 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. త్వరలోనే హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇక అనుష్క విషయానికి వస్తే భాగమతి వంటి హిట్ సినిమా తర్వాత రెస్ట్ తీసుకుంటోంది. శరీరకంగానే కాకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ఆలయాల చుట్టూ తిరుగుతోంది. అనుష్క, ప్రభాస్ లలో ఎవరికో ఒకరికి పెళ్లి అయ్యే వరకు మీడియా వాళ్ళు వీరిద్దరికి నిత్యం పెళ్లి చేస్తూనే ఉంటారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus