ఆ విషయంలో సాయం చేసుకోనున్న ప్రభాస్, శ్రధ్ధ కపూర్!

  • September 6, 2017 / 01:55 PM IST

బాహుబలి తర్వాత యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్, బాలీవుడ్ నటులు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే లపై యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ షూటింగ్ లో త్వరలో హీరోయిన్ శ్రద్ధ కపూర్ జాయిన్ కానుంది. ప్రభాస్, శ్రద్ధలపై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఏకకాలంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం హీరోహీరోయిన్లకు కొత్త చిక్కు తెచ్చి పెట్టింది.

శ్రద్ధకి తెలుగు రాదు. ఆమె తెలుగు వెర్షన్ షూటింగ్ సమయంలో ఇబ్బంది పడుతుంది. అలాగే హిందీ లో ప్రభాస్ కి పట్టు లేదు. అతను హిందీ వెర్షన్ షూట్ లో తడబడతారు. ఇలా ఒకరికొకరు ఇబ్బందిపడకుండా ఉండాలని ముందే ఒక మాట అనుకున్నారంట. తెలుగు పలకడంలో ప్రభాస్ శ్రద్ధకి సాయం చేయనుండగా, శ్రద్ధ ప్రభాస్ కి హిందీ ఎలా పలకాలో చెప్పనుంది. ఈ విధంగా అండర్ స్టాండింగ్ ఉంటే వెండితెరపై ఈ జంట ఆకట్టుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus