టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ తమ్ముడు ప్రభోద్ చెక్ బౌన్స్ కేసులో చిక్కుకొన్నాడు. సికింద్రాబాద్ కు చెందిన ఓ వ్యాపారస్తుడికి ప్రభోద్ 43 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండగా.. అప్పుడు ఇచ్చిన చెక్, అకౌంట్ లో డబ్బులు లేని కారణంగా రిటర్న్ అయ్యింది. సదరు వ్యాపారి అప్పట్లోనే ప్రభోద్ పై కేసు వేశాడు.
రాజేంద్రనగర్ కోర్టు ప్రభోద్ ను హెచ్చరించడంతోపాటు.. జరిమానాగా 43 లక్షలకు బదులుగా వడ్డీతో కలిపి 80 లక్షలు చెల్లించమని తీర్పు ఇచ్చింది. ప్రభోద్ మళ్లీ 80 లక్షలకు మరో చెక్ ఇవ్వగా.. మునుపటిలాగే ఆ చెక్ కూడా బౌన్స్ అయ్యింది. దాంతో.. కోర్టు ఉత్తరువులను సైతం పట్టించుకోని ప్రభోద్ పై న్యాయస్థానం ఆగ్రహించి.. అతడికి ఏడాది జైలు శిక్ష విధించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ప్రభాస్ కు అసలు ఒక తమ్ముడున్నాడన్న విషయం తెలియని చాలా మంది తెలుగు ప్రేక్షకుల “ప్రభాస్ తమ్ముడికి జైలు శిక్ష” అనే వార్త విని షాక్ అవుతున్నారు