ప్రభాస్ కి ఇష్టమైన వాలీబాల్ కోర్ట్ కి దారేది!!

  • May 27, 2017 / 06:24 AM IST

ప్రభాస్ సినిమాల్లోకి రాకముందు నుంచి బాడీపైన చాలా దృష్టి పెడుతారు. డ్రగ్స్ జోలికి వెళ్లకుండా నేచురల్ గా శిల్పంలా మలుచుకున్నారు. అందులో ఆటలకు కూడా ప్రధాన షేర్ ఉంది. ఏసీ రూమ్ ల్లో కసరత్తులు కాకుండా చెమట పెట్టేవరకు, అలసిపోయే వరకు ఔట్ డోర్ స్పోర్ట్స్ ఆడుతుంటారు. ప్రభాస్ ఇష్టంగా ఆడే స్పోర్ట్స్ లో వాలీబాల్ ప్రధానమైంది. స్టార్ కాకముందు ఎక్కడైనా స్వేచ్ఛగా ఆడుకునేవారు. వర్షం మూవీతోనే క్రేజీ హీరో అయిపోయారు. దీంతో బయట వాలీబాల్ ఆడేందుకు కుదరడం లేదు. సో హైదరాబాద్ లోనే సాండ్ వాలీబాల్ కోర్ట్ ఏర్పాటు చేసుకున్నారు.

అందుకోసమే ఇప్పటివరకు తాను ఎక్కువగా ఖర్చు చేసినట్లు ప్రభాస్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించారు. ఆ కోర్టులో ప్రభాస్ తన  స్నేహితులతో కలిసి ఎక్కువసేపు గడుపుతారని, తన సమయాన్ని, ఎనర్జీని ఇక్కడే ఖర్చు చేస్తారని ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది.  దీంతో ఆ కోర్ట్ ఎక్కడుందని ఆరా తీయగా… హైద‌రాబాద్ లోని త‌న ఇంటికి చేరువ‌లోనే ప్రభాస్ ఇసుక వాలీబాల్ కోర్ట్‌ని నిర్మించారు. కరెక్ట్ అడ్రస్ ఇవ్వడం వల్ల అతనికి స్వేచ్ఛ ఉండదని చెప్పలేకపోతున్నాం.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus