ప్రభాస్ కి పిల్లలంటే చాలా ఇష్టం. వారి మోహంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని కోరుకుంటారు. కోరుకోవడమే కాదు అందుకు తనవంతు సాయం అందిస్తుంటారు. గతంలో చిన్నారుల గుండె సంబంధ వ్యాధుల చికిత్స నిమిత్తం సాయం చేసిన ప్రభాస్ తాజాగా మరో చిన్నారి ప్రాణం కాపాడారు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఐదేళ్ల చిన్నారికి చికిత్స కోసం ఐదులక్షల సాయమందించారు. సాయంపొందిన కుటుంబం ద్వారా ఈ విషయం బయటికి వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ నిపుణుల పర్వవేక్షణలో యాక్షన్ సీన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు ఈ చిత్రాన్ని 150 కోట్లతో ఏకకాలంలోమూడు భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ముంబై లో ప్రారంభం కానుంది. బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్లు పనిచేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.