కీరవాణి పై బాహుబలి ఫ్యాన్స్ ఫైర్….కారణం !

  • April 29, 2017 / 10:42 AM IST

టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీ బహుబలి మొదటి భాగం ఎంతటి భారీ హిట్ అయ్యింది, అదే క్రమంలో నిన్న విడుదలయిన బాహుబలి2 కూడా అంతే రేంజ్ లో కలెక్షన్స్ కురిపిస్తూ దూసుకుపోతుంది…ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ మొన్న రాత్రి నుంచే కలెక్షన్స్ సునామినీ తలపించేలా ప్రదర్శింపబడుతుంది. అయితే ఇదిలా ఉంటే సినిమా హిట్ అవ్వాలి అంటే అన్ని విభాగాలు కలసి పనిచెయ్యాలి. ఆన్ని విభాగాల్లో ఏ విభాగం తేడా కొట్టినా సినిమా రిసల్ట్ తారుమారు అయిపోయే ప్రమాధం ఉంది…ఇంతకీ విషయం ఏమిటి అంటే…బాహుబలి 2 సినిమా సూపర్ ఉంది…సూపర్ హిట్ అయ్యింది…సినిమా పరంగా అంతా బాగానే ఉంది….అయితే ఈ సినిమా మైనస్ పాయంట్ ఏమైన ఉందా అంటే…ఆ ఉంది ఆది సంగీతం అంటున్నారు మన ప్రేక్షకులు…బాహుబలి 1కు మంచి మ్యూజిక్ ఇచ్చిన కీరవాణి.. సెకండ్ పార్ట్ కు మాత్రం ఆకట్టుకునే మ్యూజిక్ ఇవ్వడంలో విఫలమయ్యాడని కొందరు ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర అభిప్రాయపడుతున్నారు.

రాజమౌళి బాహుబలి 2 సినిమాను అత్యద్భుతంగా తీసినా.. కీరవాణి మాత్రం మ్యూజిక్ విషయంలో ఆశించిన స్థాయిలో అందివ్వలేదని కొందరు మాట్లాడారు. భావోద్వేగాలు ప్రధానాంశంగా తెరకెక్కిన బాహుబలి 2 పార్ట్ కు సంగీతం చాలా కీలకమైన అంశం. అలాంటి ఈ సినిమా సంగీతం విషయంలో తాము సంతృప్తి చెందలేదని కొందరు ఫ్యాన్స్ ఫీలయ్యారు. కీరవాణి ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా మరింత బాగా వచ్చేదని అభిప్రాయపడ్డారు. అయితే ఆన్‌లైన్ రివ్యూస్ లో కూడా సినిమాలో మైనస్ పాయంట్స్ లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకొలేదు అంటూ రాసుకొచ్చారు…మొత్తంగా కీరవాణి సంగీతం ఈ సినిమాకు కాస్త మైనస్ అయినా…రాజమౌళి డైరెక్షన్ తో కవర్ అయిపోయిందిలే అంటూ ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus