యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త. బాహుబలి తో తెలుగు స్టార్ నుంచి ఇండియన్ స్టార్ గా ఎదిగిన డార్లింగ్.. ఆ ఇమేజ్ ని కొనసాగించే విధంగా సినిమాలు చేయనున్నారు. అంతే కాదు చిత్రాలను అత్యంత వేగంగా పూర్తి చేయనున్నారు. రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేయనున్న సినిమా ఈ ఏడాది డిసెంబర్ కి ప్రారంభం కానుంది. అందుకు యంగ్ రెబల్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. అక్టోబర్ నాటికి బాహుబలి కంక్లూజన్ షూటింగ్ పూర్తి అవుతుంది.
ఆ తర్వాత నెల రోజుల పాటు రెస్ట్ తీసుకొని న్యూ ఫిల్మ్ కి తగినట్లు బాడీ ని తగ్గించుకోనున్నారు. జనవరి నుంచి మొదలయ్యే చిత్రీకరణలో అయన పాల్గొననున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మితమయ్యే ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం విదేశాల్లోనే జరగనుంది. అందుకు కావాల్సిన ఏర్పాట్లు యువీ క్రియేషన్స్ వాళ్లు పూర్తి చేశారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే ప్రభాస్ పెళ్లి పీటలపై కూర్చుంటారని సమాచారం. ఆ పనుల్లో రెబల్ స్టార్ కృష్ణం రాజు బిజీగా ఉన్నట్లు తెలిసింది. అయితే వచ్చే ఏడాది ప్రభాస్ అభిమానులకు బాహుబలి కంక్లూజన్ రిలీజ్ ఒక పండుగ, పెళ్లి మరో పండుగ కానుంది.