ప్రభాస్ ఫాన్స్ VS బన్నీ ఫ్యాన్స్

  • July 4, 2016 / 08:21 AM IST

ప్రభాస్ నటించిన “బాహుబలి” సినిమా ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ అయ్యింది. అదే క్రమంలో బన్నీ నటించిన “సరైనోడు” సినిమా సైతం కధ ఏమాత్రం లేనప్పటికీ సినిమా పరంగా బోయ పాటి మార్క్ యాక్షన్ ఉండడంతో సూపర్ సక్సెస్ సాధించింది. అయితే ఆ సినిమాకి ఈ సినిమాకు ఎక్కడ పొంతన కుదరదు. రెండూ డిఫరెంట్ జొనర్ కు సంభందించిన చిత్రాలు. అయితే ఈ రెండు చిత్రాల పుణ్యమా అని ఇప్పుడు ప్రభాస్, బన్నీ అభిమానులు ఒకటికొకరు గొడవలు పడుతున్నారు.

విషయంలో లోకి వెళితే, సినిమాలు సూపర్ హిట్ అవడం, ఆ సూపర్ హిట్ సక్సెస్ ను అభిమానులు బ్యానర్స్ రూపంలో వీది వీధుల్లో ప్రదర్శించడం సహజమే. అయితే అదే చేశారు బన్నీ అభిమానులు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో బన్నీ “సరైనోడు” సినిమాకు మంచి కలెక్షన్స్ రావడంతో తమ అభిమానాన్ని బ్యానర్స్ రూపంలో ప్రదర్శించారు బన్నీ ఫ్యాన్స్. అయితే తమ హీరో సినిమా హిట్ అయ్యింది అని చెప్పుకునే క్రమంలోనే “సరైనోడు” సినిమా బాహుబలిని మించి పోయింది అని సైతం ప్రదర్శించడంతో దీనిపై ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు.

తమ హీరో గురించి, తమ హీరో సినిమా సక్సెస్ గురించి బన్నీ ఫ్యాన్స్ ప్రదర్శించుకోవడంలో తప్పు లేదు, కానీ, ఆ విషయంలో మా హీరో ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చినట్లు అని కోపంగా ఉన్నారు మన యంగ్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్. అయితే అదే క్రమంలో గతంలో భీమవరంలో పవన్ ప్రభాస్ అభిమానుల మధ్య ఇటువంటి ఫ్లక్సీల వార్ జరిగిన సంగతిని ఇప్పుడిప్పుడే మరచిపోతున్న క్రమంలో మళ్ళీ ఈ వివాదం ఎంతవరకూ  పోతుందో అన్న భయంతో ఉన్నారు ఇరు వర్గాలు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus