రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ'(Fauzi). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న విడుదల చేసి, ఒకరోజు ముందుగానే అంటే.. డిసెంబర్ 3న గ్రాండ్‌గా ప్రీమియర్ షోలు వేస్తామని మేకర్స్ ప్రకటించారు.
అయితే, సినిమా వాయిదా పడుతుందంటూ రూమర్స్ వచ్చాయి. తాజాగా ఆ రూమర్స్ కి నిర్మాత వై. రవిశంకర్ స్పష్టతనిచ్చారు. నాని హీరోగా రూపొందిన ‘ప్యారడైజ్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. ‘ఫౌజీ’ వాయిదాను అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. “ఫౌజీ రిలీజ్ కొంచెం వెనక్కి వెళ్తుంది, అందుకు సారీ.. కానీ ఇది మాత్రం వేరే లెవెల్ సినిమా” అని ఆయన స్పష్టం చేశారు. అలాగే “బాహుబలి తర్వాత ప్రభాస్ అన్నను అంత గొప్పగా మీరు మళ్ళీ ఈ చిత్రంలోనే చూస్తారు.
ఇది కచ్చితంగా ఆ రేంజ్ సినిమా. ఇందులో మొత్తం 5 పాటలు ఉంటాయి. సినిమా కాస్త ఆలస్యమైనా, థియేటర్లలో మీరు దీన్ని లైఫ్‌లాంగ్ చెరీష్ చేసుకుంటారు” అని రవిశంకర్ నమ్మకం వ్యక్తం చేశారు. ఆయన మాటలతో సినిమా రిలీజ్ లేట్ అయినా, కంటెంట్ మాత్రం బాహుబలి స్థాయిలో ఉండబోతుందని డార్లింగ్ ఫ్యాన్స్ సరిపెట్టుకోవాల్సిందే. అయితే కొత్త విడుదల తేదీపై మాత్రం నవీన్ క్లారిటీ ఇవ్వలేదు. ఫౌజీ సినిమాతో ఇమాన్వి అనే ఇన్ఫ్లుయెన్సర్ హీరోయిన్ గా పరిచయమవుతుంది. అలాగే ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్..లు ఉన్నాయనే టాక్ కూడా చాలా రోజుల నుండీ నడుస్తుంది.