హిందీ కంటే తమిళంలోనే బాగా మాట్లాడిన ప్రభాస్

  • August 17, 2019 / 01:20 PM IST

ప్రభాస్ పేన్ ఇండియా యాక్టర్ అయినప్పటికీ.. పరాయి భాషల్లో తన సినిమాను ప్రమోట్ చేయడం కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మాత్రం అక్కడి లోకల్ లాంగ్వేజ్ మీద పెద్ద పట్టు లేకపోవడంతో అక్కడ ప్రెస్ మీట్స్ లో సమాధానం చెప్పడానికి బాగా ఇబ్బందిపడుతున్నాడు. మొన్న ముంబైలో హిందీ జర్నలిస్ట్స్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కూడా ఇబ్బందిపడ్డాడు ప్రభాస్. అయితే.. నిన్న జరిగిన చెన్నై ప్రెస్ మీట్ లో మాత్రం ఫ్లూయంట్ గా తమిళ్ మాట్లాడి తమిళ ప్రేక్షకుల్ని, పాత్రికేయుల్ని ఆశ్చర్యపరిచాడు ప్రభాస్.

ఆగస్ట్ 30న ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో విడుదలవుతున్న “సాహో” ద్వారా తమిళ, హిందీ ప్రేక్షకులను డైరెక్ట్ గా పలకరించనున్నాడు ప్రభాస్. శ్రద్ధాకపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు. పాటలు, ట్రైలర్ ఆల్రెడీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. మరి ఈ సినిమా బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందా లేదా అనే విషయం తెలియాలంటే ఆగస్ట్ 30 వరకు వెయిట్ చేయాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus