యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ “బాహుబలి” సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో “సాహో” చిత్రంతో ఫుల్ బిజీ అయిపోయాడు. ఈ సినిమాకి 100 కోట్లు పైనే ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తుంది. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంటూ ఉండగానే ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టాడు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రొమాంటిక్ లవర్ బాయ్ గా కనిపించనున్నాడు.
ఆల్రెడీ ఒక షెడ్యూల్ ఫినిష్ చేసుకొన్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. అందుకే ప్రభాస్ ఆ పాత్ర కోసం ఏకంగా 20 కేజీల దాకా బరువు తగ్గనున్నాడట. ‘బాహుబలి’ సిరీస్ కోసం అమితంగా బరువు పెరిగిన ప్రభాస్ దర్శకుడి మాట మేరకు స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ వర్కవుట్స్ చేస్తూ బరువు తగ్గించుకుంటున్నాడట. ప్రభాస్ లీన్ లుక్ కోసం రాధాకృష్ణ వెయిటింగ్.