దుబాయ్ కి వెళ్లనున్న ప్రభాస్ బృందం

  • June 24, 2017 / 06:57 AM IST

బాహుబలి కంక్లూజన్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయింది. యువ డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభించారు. సిటీ సెంట్రల్ లైబ్రరీలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ పై కొన్ని షాట్స్ తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ ని ముంబై లో ప్రారంభించాలని అనుకున్నారు. కానీ తాజాగా నిర్ణయం మార్చుకున్నారు. దుబాయ్ లోని సీన్స్ కంప్లీట్ చేయాలనీ సుజీత్ డిసైడ్ అయ్యారు.

అందుకే చిత్ర బృందం త్వరలో దుబాయ్ కి వెళ్లనుంది. అక్కడ ప్రఖ్యాత చెందిన అబుదాబి ప్రాంతంలో హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నారు. ప్రభాస్ పోలీసాఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రానికి టెక్నీషియన్లు, ఆర్టిస్టులు అందరూ ఫిక్స్ అయ్యారు. ఒక హీరోయిన్ విషయంలో ఇంకా చర్చలు సాగుతున్నాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus