ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సినీ స్టార్లు అండగా నిలుస్తుంటారు. నిరాశ్రయులకు నీడ కల్పిస్తుంటారు. ఇలా వారి సాయానికి హద్దు అంటూ ఉండదు. ఇప్పుడు మరో మారు పండుటాకుల కష్టాలు చూసి చలించారు. వారికోసం ఆర్థిక సాయం అందించారు. వివరాల్లోకి వెళితే.. లక్ష్మి అనే ఓ సామాజిక కార్యకర్త ఖమ్మం జిల్లాలో ఓ వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తోంది. ఆమె ఉద్యోగం నుంచి రిటైర్ కావడంతో నడపడం కష్టం అయింది.
దీంతో లక్ష్మి సాయం కోరగా సినీ నటులు స్పందించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అధిక మొత్తంలో డబ్బులు సాయం చేశారు. వృద్ధాశ్రమం భవన నిర్మాణానికి రాజమౌళి అత్త రాధమ్మ, యాంకర్ సుమ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కమెడియన్ అలీ, శ్యాం ప్రసాద్‌రెడ్డి, వివేక్ తదితరులు సాయం చేశారు. అంతేకాకుండా మంచు లక్ష్మి నిర్వహించే ‘మేము సైతం’ ప్రోగ్రామ్‌కు కూడా హాజరై లక్ష్మి విరాళాలు సేకరించింది. ఇలా మంచి పనికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని సినీ స్టార్స్ మరో సారి నిరూపించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.