నెక్స్ట్ సినిమాలో ఇంట్రెస్టింగ్ రోల్ చేయనున్న ప్రభాస్

  • June 17, 2017 / 12:33 PM IST

బాహుబలి 2 తర్వాత యంగ్ రెబల్ స్టార్ ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యువీ క్రియేషన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ మొదలయింది. ప్రభాస్ లేకుండా కొన్ని సీన్స్ తెరకెక్కించారు. లేటెస్ట్ షెడ్యూల్ లో ప్రభాస్ జాయిన్ కానున్నారు. ఈ చిత్రం తర్వాత సినిమాకి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోపి కృష్ణ ఫిలిమ్స్ బ్యానర్లో కృష్ణం రాజు నిర్మించనున్న ఆ సినిమాని జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీలో ప్రభాస్ రోల్ బయటికి వచ్చింది.

ఆస్ట్రాలజర్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. గ్రహాల పరిస్థితిని అంచనా వేసి జాతకాలు చెప్పే పాత్రలో మెరవనున్నారు. ఈ క్యారక్టర్ వినడానికే క్రేజీగా ఉంది. ఆ పాత్రలో ప్రభాస్ కనిపిస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మధ్య హీరోలు ఎవరూ ఈ పాత్ర పోషించలేదు. అందుకే ఈ కథకు ప్రభాస్ ఒకే చెప్పినట్లు తెలిసింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus