రకుల్ తనకి సెట్ కాదన్న ప్రభాస్

  • March 24, 2017 / 03:05 PM IST

ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ని డార్లింగ్ ప్రభాస్ అవమానించారా?.. అవును ఇది నిజమే. వరుస విజయాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ జాబితాలో స్థానం సంపాదించుకున్న ఈ భామను ప్రభాస్ ఎందుకు అవమానించారో తెలుసుకోవాలంటే ఏడేళ్లు వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే అప్పుడే  ఈ సంఘటన జరిగింది. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ప్రభాస్ కి జోడీగా మొదట రకుల్, తాప్సి ని తీసుకున్నారు. రకుల్, ప్రభాస్ మధ్య మూడు రోజులు షూటింగ్ కూడా చేశారు. అయితే డార్లింగ్, రకుల్ జోడి సెట్ కాలేదని సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పారంట.

ప్రభాస్ కి కూడా అదే ఫీలింగ్ రావడంతో డైరక్టర్ దశరధ్ కి చెప్పారంట. దీంతో ఆమెను తీసేసి కాజల్ అగర్వాల్ ని పెట్టుకున్నారు.   ప్రభాస్ తో నటించే అవకాశం కోల్పోయినందుకు రకుల్ చాలా బాధపడిందంట. ఆ కసితోనే కష్టపడి తెలుగు నేర్చుకొని, నటనను మెరుగు పరుచుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మరి ఇప్పుడు ప్రభాస్ ఆమెని హీరోయిన్ గా ఒకే చేస్తారా?


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus