విజయాలను ప్రమోట్ చేసుకోని యంగ్ రెబల్ స్టార్

సినీ హీరోలకు ప్రచారం తప్పనిసరి. వారి సినిమాల విజయానికి మీడియా సహకారం అవసరం. అందుకే వారితో టచ్ లో ఉండాలి. వీలు కుదరక పోయినా, సిగ్గు వల్ల నలుగురిలో కలవక పోయినా పీఆర్ఓ ని నియమించుకొని మీడియా మిత్రులకు,  పబ్లిక్ కి అందుబాటులో ఉండాలి. దాదాపు టాలీవుడ్ లో స్టార్లందరికీ పీఆర్ఓలు ఉన్నారు. హీరోలు సాధించిన విషయాలను వారు అందరికీ తెలిసేలా చేస్తారు. ఇటువంటి పబ్లిసిటీకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దూరంగా ఉన్నారు.

తాను ఎన్ని విజయాలు సాధించినా గొప్పలకు పోవడం లేదు. మిర్చి సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన డార్లింగ్ ఆ సినిమా రికార్డుల గురించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు. అలాగే బాహుబలి బిగినింగ్ కోసం ఎంత శ్రమించినా, అది ఎంతో ఎంత గొప్ప విజయం సాధించినా ప్రభాస్ మిస్టర్ కూల్ గా ఉన్నారు. తన వైపు నుంచి ఎటువంటి హంగామా చేయడంలేదు. తాజాగా బ్యాంకాక్ లోని టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు  ప్రభాస్ మైనపు బొమ్మని తమ మ్యూజియంలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో ఏ నటుడికి దక్కని   గౌరవం ఇది. అయినప్పటికీ సైలంట్ గా తాను బాహుబలి కంక్లూజన్ షూటింగ్ లో నిమగ్నమయ్యారు. అభిమానులు సైతం తమ హీరో గొప్ప అని ఎక్కడా ఆర్భాటాలు చేయక పోవడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus