‘బాహుబలి’ కి ముందు ప్రభాస్(Prabhas) నటించిన ప్రతి సినిమాలోనూ అతని లుక్ హైలెట్ గా నిలిచేది. కానీ ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ లుక్స్ లో చాలా మార్పులు వచ్చాయి. మొదట అతను ఫిజిక్ సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు అనే విమర్శలు ఎదుర్కొన్నాడు. ‘సాహో’ ‘రాధే శ్యామ్’ ‘ఆదిపురుష్’ వంటి సినిమాల్లో ప్రభాస్ షేపౌట్ అయినట్టు ఈజీగా తెలిసిపోతుంది. అందుకే ‘సలార్’ నుండి ఫిజిక్ పై కొంత ఫోకస్ పెట్టాడు.
అటు తర్వాత ప్రభాస్ ఏ ఈవెంట్లో కనిపించినా తలకి హ్యాట్ పెట్టుకుని కనిపిస్తుండేవాడు. దీనిపై కూడా ఎక్కువ విమర్శలు వచ్చేవి. ప్రభాస్ ‘షిరిడీ సాయిలా మారిపోయాడని’ ఇలా రకరకాల విమర్శలు వచ్చేవి.గతంతో పోలిస్తే ప్రభాస్ హెయిర్ పల్చబడింది అనేది వాస్తవం. దీనికోసం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటివి ప్రభాస్ చేయించుకుంటున్నాడు అనేది కూడా ఇన్సైడ్ టాక్. కాకపోతే సర్జెరీ సక్సెస్ కాలేదని.. అందుకే విదేశాలకి వెళ్ళి హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.
ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ప్రభాస్ లేటెస్ట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ‘కపుల్ ఫ్రెండ్లీ’ టీమ్ తో ప్రభాస్ ఓ చిట్ చాట్లో పాల్గొని సినిమాని పుష్ చేసే ప్రయత్నం చేశాడు. ప్రభాస్ కి హోమ్ బ్యానర్ వంటి ‘యూవీ క్రియేషన్స్’ లో రూపొందిన సినిమా ఇది. అందులోనూ ప్రభాస్ బాధ్యతగా ఫీలయ్యే సంతోష్ శోభన్ హీరో. వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాకి ఓకే ఓకే అనిపించే టాక్ వచ్చింది.
ఓటీటీ డీల్ కోసం ప్రభాస్ తో ఇంటర్వ్యూ చేయించి పుష్ చేసే ప్రయత్నం చేశారని టాక్. ఏదైతేనేం ఈ వీడియోలో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంది. వింటేజ్ ఫీలింగ్ కలిగించింది. ‘తలకి హ్యాట్..లు వంటివి పెట్టుకోకుండా, లుక్ ఇలాగే మెయింటైన్ చెయ్యి అన్నా’ అంటూ ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ ఈ లుక్లోకి మారినట్టు తెలుస్తుంది.