Prabhas House: ‘బాహుబలి’ బడ్జెట్ కు తీసిపోని ప్రభాస్ ఇల్లు..!

  • October 23, 2022 / 03:31 PM IST

యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ‘బాహుబలి’ చిత్రం తరువాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు తో పాటు హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ప్రభాస్ కు క్రేజ్ ఏర్పడింది.కేవలం ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే ‘బాహుబలి తరువాత ప్రభాస్ నటించే ప్రతీ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రూపొందిస్తున్నారు నిర్మాతలు.

ప్రస్తుతం ప్రభాస్.. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయ్యాక ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తన 21 వ చిత్రం చెయ్యడానికి ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉండగా… నిజ జీవితంలో ప్రభాస్ చాలా స్టైలిష్ గా ఉంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే. అతని డ్రెసింగ్ చూస్తేనే ఈ విషయం క్లియర్ గా స్పష్టమవుతుంటుంది.

అయితే అతని ఇల్లు కూడా అంతే స్టైలిష్ గా ఉంటుందనే విషయం మాత్రం చాలా మందికి తెలీదనే చెప్పాలి. కళ్ళు చెదిరే ఇంటీరియర్ తో తన ఇంటిని డిజైన్ చేయించుకున్నాడు ప్రభాస్. హైదరాబాద్ లో ఉన్న ప్రభాస్ ఇల్లు మంచి గార్డెన్, జిమ్, స్విమ్మింగ్ పూల్ తో కలిగి ఉంది. ఇక దీని రేటు ఎంతో తెలుసా? అక్షరాలా 60కోట్లట. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ..! ‘ ‘బాహుబలి’ బడ్జెట్ లో ఈ ఇంటి రేటు సగం ఉన్నట్టు’ ఉంది కొందరు నెటిజన్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు.

1

2

3

4

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus