భాగమతి మేకింగ్ వీడియోలో కనిపించిన ప్రభాస్

  • January 25, 2018 / 12:45 PM IST

ప్రభాస్, అనుష్క.. వెండితెరపైన హిట్ పెయిర్. ఇద్దరూ కలిసి నటించిన మిర్చి, బాహుబలి చిత్రాలు సంచలన విజయం సాధించాయి. వీరు బాహుబలి చిత్రం కోసం ఐదేళ్లు కలిసి ప్రయాణం చేశారు. నిజజీవితంలో మంచి మిత్రులుగా మిగిలారు. వృత్తి, వ్యక్తిగతమైన విషయాలు ఒకరికొకరు పంచుకుంటారు. రీసెంట్ గా అనుష్క ప్రభాస్ చేస్తున్న సాహో మూవీ సెట్ లోకి వెళ్లి యూనిట్ ని ఆశ్చర్య పరిచింది. సినిమా షూటింగ్ విశేషాలు అడిగి తెలుసుకుంది. ఆలాగే అనుష్క బాహుబలి తర్వాత చేసిన భాగమతి సెట్ కి ప్రభాస్ వెళ్లి షూటింగ్ ని పర్వవేక్షించారు. ఈ విషయం మనకి చాలా ఆలస్యంగా తెలిసింది. అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రేపు గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ ప్రమోషనల్‌ సాంగ్ వీడియోను విడుదల చేశారు.

అనుష్క హాట్‌గా, గ్లామరస్‌గా కనిపించిన ఈ ప్రమోషన్‌ వీడియోలో ప్రభాస్‌ తళుక్కున మెరిశారు. షూటింగ్‌ స్పాట్‌కు వచ్చిన ప్రభాస్‌ ముఖానికి కర్చీఫ్‌ కట్టుకొని ఉండగా.. అలా చూపించి చూపించనట్టు ఇందులో కనిపించారు. ముఖానికి కర్చీఫ్‌ కట్టుకున్నా.. బహుబలిని అభిమానులు గుర్తించారు. వెంటనే ఆ వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. మూడు నిమిషాల 27 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఒక నిమిషం 50 సెకన్ల వద్ద ప్రభాస్‌ క్షణం పాటు కనిపించారు. దీంతో ప్రభాస్ భాగమతిలో గెస్ట్ రోల్ ఏమైనా చేసారా? అని అభిమానుల్లో ప్రశ్న తలెత్తింది. ప్రభాస్ స్నేహితులు వంశీ, ప్రమోద్ లు యువీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించిన మూవీ కావడంతో.. ఫ్రెండ్స్ కోరిక మీద కాసేపు కనిపించనున్నారా? అని సినీ విశ్లేషకులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర యూనిట్ ప్రభాస్ ఎంట్రీ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus