ఇతర భాషల్లోనూ ప్రభాస్ సినిమా

  • May 27, 2016 / 02:06 PM IST

బాహుబలి సినిమాలో నటించిన నటీనటులు రెండు మూడు సినిమాల్లో బిజీ అయిపోతుంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం రాజమౌళి కాంపౌండ్ నుంచి ఇంకా బయటకి రాలేదు. అయితే బాహుబలికి ముందే “రన్ రాజా రన్” డైరెక్టర్ సుజీత్ కి మాట ఇచ్చారు కాబట్టి అతనితోనే సినిమా చేయనున్నారు. దీనికి నిర్మాతలుగా మిత్రులు ప్రమోద్, వంశీ ఎప్పుడో ఖరారయ్యారు.

వీరి బ్యానర్ యూవీ క్రియేషన్స్ లో వచ్చిన మిర్చి సూపర్ హిట్ అయ్యింది. బాహుబలి కంక్లూజన్ పూర్తికాగానే ప్రభాస్ యూవీ క్రియేషన్స్ లో సుజీత్ తెరకెక్కించ నున్న మూవీ పనుల్లో నిమగ్న కానున్నారు.

బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఇతరభాషల్లో కూడా రెబల్ స్టార్ కు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అతని గత సినిమాలను డబ్ చేసి రిలీజ్ చేసి సొమ్ములు చేసుకుంటున్నారు నిర్మాతలు. దీంతో సుజీత్ ఆలోచనలో పడ్డారు. ఒకే సారి హింది, తమిళ్, తెలుగు భాషల్లో నిర్మించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇతర భాషల వారికి కూడా నచ్చేలా కథలో స్వల్ప మార్పులు చేసే పనిలో పడ్డారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus