ప్రభాస్ బాహుబలి సినిమా అంచనాలు మించి హిట్ అయ్యింది, ఇక ఆ దెబ్బతో ఇటు టాలీవుడ్ లోనే కాదు, అటు బాలీవుడ్ లో కూడా రికార్డులకు చెక్ పెట్టి, సరికొత్త రికార్డులు సృష్టించాడు, అయితే ఆ సినిమా తరువాత ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్దం చేస్తున్నాడు దర్శకుడు. అయితే అదే క్రమంలో సాహో కోసం బాలీవుడ్ హీరోయిన్ ను వెతికే వేటలో పడ్డాడు మన దర్శకుడు. అంతేకాకుండా ఈ సినిమాని దాదాపుగా 150కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాని ప్రభాస్ సొంత సంస్థ యువి క్రియేషన్స్ నిర్మిస్తుందట. అయితే సుజిత్ ఈ సినిమాని ఎలాయినా స్పెషల్ గా హిట్ చెయ్యాలి అని పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు. ఇక మరో పక్క బాహుబలి కోసం అయిదు ఏళ్లు కష్టపడ్డ ప్రభాస్ ప్రస్తుతం హోలిడేస్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం హోలిడేలో ఉన్నాడు ప్రభాస్ అని అందరూ అనుకుంటుంటే, మరో పక్క ప్రభాస్ మేక్ ఓవర్ లో ఆన్లైన్ లో హల్చల్ చేస్తున్నాడు…ఇంతకీ విషయం ఏమిటి అంటారా….హాలీడేస్ ఎంజాయ్ చేసి వచ్చిన డార్లింగ్, ఇప్పుడు మేకోవర్ మీద దృష్టి పెట్టాడు అంటున్నారు యంగ్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్.
దానికి నిదర్శనంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ప్రభాస్ ఫోటో ని చూపిస్తున్నారు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ హకీమ్ అలీం ప్రభాస్ తో కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో పేజ్ లో షేర్ చేయగా… ఆ ఫోటోలో కాస్త సన్నబడి, డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపిస్తున్నాడు ప్రభాస్. అయితే ఇదే సాహో లుక్ అంటూ ఆన్లైన్ లో రచ్చ జరుగుతున్న క్రమంలో నిజమేనేమో అన్న అనుమానం కలుగుతుంది. ఏది ఏమైనా….అఫీషియల్ అయినా కాకపోయినా, ప్రభాస్ డార్లింగ్ మాత్రం నిజంగా సూపర్ గా కనిపిస్తున్నాడు అనే చెప్పాలి. అదన్న మాట మ్యాటర్.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.