యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చేయనున్న సినిమా ముహూర్తం ఫిక్స్ అయింది. అనేక వాయిదాల తర్వాత “రన్ రాజా రన్” ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో డార్లింగ్ సినిమా మొదలు కాబోతోంది. యువీ క్రియేషన్స్ వారు 100 కోట్ల బడ్జక్ట్ తో నిర్మించనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 10న ప్రారంభంకానుంది. ఆ రోజు ప్రభాస్ పై ముహూర్తపు షాట్ ని చిత్రీకరించనున్నారు. రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి ఉంటుందని సుజీత్ సన్నిహితులు చెప్పారు.
తెలుగు అభిమానులతో పాటు తమిళ్, హిందీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ స్క్రిప్ట్ ని డైరక్టర్ మలిచారు. ఇందులో ప్రధానమైన యాక్షన్ సీక్వెన్స్ ను దుబాయిలో చిత్రీకరించడానికి సుజీత్ ప్లాన్ చేస్తున్నారు. అక్కడి నేపథ్యంలో సినిమా సాగుతుందని సమాచారం. ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి కంక్లూజన్ కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ సినిమా ప్రొడక్షన్ వర్క్ నవంబర్ కి కంప్లీట్ కానుంది. అనంతరం ఒక నెల రెస్ట్ తీసుకొని కొత్త సినిమా షూటింగ్ లో ప్రభాస్ పాల్గొననున్నారు.