డైరక్టర్ సెంటిమెంట్ కే విలువిచ్చిన ప్రభాస్

  • October 13, 2018 / 12:30 PM IST

సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీ చేస్తూనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 20 వ సినిమాని పట్టాలెక్కించారు. “జిల్” ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ 20 నుంచి ఇటలీలో జరుగుతోంది. ఈ షూటింగ్ లో ప్రభాస్, పూజా హెగ్డే తో పాటు కీలక పాత్ర దారులు పాల్గొంటున్నారు. గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అమూర్‌’ (ఫ్రెంచ్‌లో ప్రేమ అని అర్థం) అనే టైటిల్‌ను మొదట పరిశీలించారు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ఈ టైటిల్ ఉపయోగపడుతుందని చిత్ర బృందం అనుకుంది. కానీ డైరక్టర్ కి జిల్ సినిమా మంచి ఎంట్రీని ఇచ్చింది.

అందుకే జె తో మొదలయ్యే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. “జాన్” అనే టైటిల్ కి ప్రభాస్ ఓకే చెప్పడంతో త్వరలోనే అధికారికంగా ప్రకటించాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ని డార్లింగ్ అనడం మానేసి .. జాన్ అని పిలుస్తారని నమ్ముతోంది. 1970 నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ కోసం హైదరాబాద్ లో ఏడుకోట్లతో భారీ సెట్ వేస్తున్నారు. ఇటలీలో షెడ్యూల్ తర్వాత ఇక్కడే షూట్ చేయనున్నారు. ఈ మూవీని 2019 లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus