సింగం 3 లో ప్రభాస్ నటించడంలేదని స్పష్టం చేసిన నిర్మాత

  • October 4, 2016 / 01:37 PM IST

తమిళ నటుడు సూర్య సింగం సీక్వెల్ గా వస్తున్న సిగం3 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. శృతి హాసన్, అనుష్క హీరోయిన్లుగా నటిస్తున్న ఈ యాక్షన్ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు కొన్ని రోజులుగా సోయాసాల్ మీడియాలో వార్త షికారు చేసింది. అయితే ఆ వార్తలో వాస్తవం లేదని తేలింది.

ఆ చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ రోజు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ “మా సినిమాలో ప్రభాస్ నటించడం లేదు. ఆయనే కాదు ఇతర ఏ స్టార్ హీరో ప్రత్యేక పాత్ర పోషించడం లేదు. అటువంటి రోల్ కూడా మా చిత్రంలో లేదు” అని స్పష్టం చేశారు. దీంతో డార్లింగ్ స్పెషల్ అప్పీరియన్స్ పై గాసిప్ లకు చెక్ పడింది. ప్రస్తుతం ప్రభాస్ ‘బాహుబలి 2’ సినిమా షూటింగులో పాల్గొంటున్నారు. ఈ షూటింగ్ నవంబర్ నాటికీ కంప్లీట్ కానుంది. దీని తర్వాత యంగ్ రెబల్ స్టార్ సుజీత్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.

https://www.youtube.com/watch?v=BfbhVKXzh_Q

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus