అక్టోబర్ 22 ప్రభాస్ ఫ్యాన్స్ కు చాలా ప్రత్యేకం!

  • October 16, 2017 / 06:08 AM IST

గతేడాదివరకూ ప్రభాస్ అభిమానులు అతడి పుట్టినరోజును ఎలా సెలబ్రేట్ చేసుకొన్నారు అనేది గతం. ఈ అక్టోబర్ 22ను ఎంత ఘనంగా నిర్వహించుకొంటారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే.. “బాహుబలి” రిలీజై ఇంటర్నేషనల్ స్టార్ గా ప్రభాస్ ఎదిగిన తర్వాత వస్తున్న మొదటి బర్త్ డే ఇది. అయితే.. గత అయిదేళ్లుగా ప్రభాస్ “బాహుబలి” చిత్రీకరణలోనే నిమగ్నమైపోవడంతో.. ఒకే గెటప్ లో ప్రభాస్ ను చూసి చూసి ఫ్యాన్స్ కూడా బోర్ ఫీలయ్యారు. అందుకే మొన్నామధ్య ఒక స్టైలిష్ ఫోటోషూట్ ను వదిలాడు. అయితే.. వచ్చేవారం పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ కోసం ఓ స్పెషల్ ఫోటోషూట్ చేయించాడు. ఇప్పటివరకూ ప్రభాస్ ను ఎవరూ కనీసం ఊహించని విధంగా, అల్ట్రా స్టైలిష్ గా ఈ ఫోటోషూట్ ఉండబోతోందట.

అలాగే.. “సాహో” బృందం కూడా ప్రభాస్ పుట్టినరోజున అభిమానుల కోసం సినిమాలోని ప్రభాస్ వర్కింగ్ స్టిల్స్ తోపాటు మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేయనున్నారు. వీటితోపాటు.. ప్రభాస్ ప్రత్యేకంగా తన అభిమానుల కోసం ఫేస్ బుక్ లో ఒక పర్సనల్ వీడియో కూడా అప్లోడ్ చేయనున్నాడట. సో, డియర్ ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ ఫర్ బ్యాగ్ ఆఫ్ సర్ప్రైజస్ ఫ్రమ్ ప్రభాస్ అండ్ టీం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus