అభిమానులకు కానుక ఇవ్వనున్న ప్రభాస్!

  • October 3, 2017 / 11:24 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో చాలా ఫ్రెండ్లీ గా ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరూ అతన్ని డార్లింగ్ అని పిలుస్తుంటారు. ప్రభాస్ కూడా ఫ్యాన్స్ కోసం కష్టపడుతుంటారు. తన పుట్టిన రోజుకి అభిమానులకు కానుక ఇవ్వడం అతని స్టైయిల్. గత మూడేళ్ళుగా తన బర్త్ డే రోజున బాహుబలికి సంబంధించి ఫస్ట్ లుక్,  ట్రైలర్, టీజర్, రిలీజ్ చేశారు. ఈ సారి ఫ్యాన్స్ కోసం ఓ గిఫ్ట్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ సాహో సినిమా చేస్తున్నారు.

యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. సాహో టీజర్ ఇదివరకే రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. ప్రభాస్ పుట్టినరోజు (23 ) సందర్భంగా ఈ మూవీ మేకింగ్ వీడియోని రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. అంతేకాదు ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు సమాచారం. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ లుక్ చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus