2020లో ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు సినిమాల రిలీజ్ కి ప్లానింగ్

Advertisement

అయిదేళ్లు “బాహుబలి” కోసం వెచ్చించిన తర్వాత ఇక నుండి ఏడాదికి రెండు సినిమాలు తప్పకుండా చేస్తాను అని స్వయంగా ప్రభాస్ మాట ఇవ్వడం, “సాహో” సినిమాకి కూడా మూడేళ్ళ టైమ్ పట్టడంతో ఆ మాటను ప్రభాస్ నిలబెట్టుకోలేకపోవడం జరిగిపోయాయి. అయితే.. 2020లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాను నటించిన రెండు సినిమాలు విడుదలయ్యేలా జాగ్రత్తలు తీసుకొంటున్నాడు ప్రభాస్. ఇటీవల ఫ్యామిలీతో ప్యారిస్ ట్రిప్, పుట్టినరోజున లండన్ ట్రిప్ ఫినిష్ చేసుకొని ఇండియా వచ్చిన ప్రభాస్.. ప్రస్తుతం తన లుక్స్ ను ఛేంజ్ చేసుకొనే పనిలో ఉన్నాడు. ఇదే సమయంలో కొందరు తమిళ, హిందీ దర్శకులు చెబుతున్నా కథలను కూడా వింటున్నాడట.

రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “జాన్” (వర్కింగ్ టైటిల్)ను ఆగస్ట్ లోపు విడుదల చేసి.. వెంటనే మరో సినిమా మొదలెట్టి ఏడాది చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకొంటున్నాడు ప్రభాస్. అయితే.. తాను నటించే సినిమాలన్నీ తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ విడుదలవుతాయి కాబట్టి.. భాషకు తగిన ప్రాధాన్యత మరియు కథా బలం ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటున్నాడు ప్రభాస్. మరి 2020లో ప్రభాస్ ప్లాన్ చేసినట్లు రెండు సినిమాలు గనుక విడుదల చేయగలిగితేగనుక.. ప్రభాస్ తన ఫ్యాన్స్ కి ఇచ్చే బిగ్గెస్ట్ గిఫ్ట్ అదే అవుతుంది.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus