పారాలింపిక్స్ లో భారతీయ జెండాను రెపరెపలాడించిన తంగవేలు మరియప్పన్ కు ప్రముఖులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఐదేళ్ల వయసులో బస్ కింద పడి ఒక కాలుని కోల్పోయిన తంగవేలు నిరాశలో కూరుకు పోకుండా కష్టపడ్డాడు. కలను నెరవేర్చుకున్నాడు. రియోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో పురుషుల హైజంప్‌లో 1.89మీ.
ఎత్తుకు ఎగిరి స్వర్ణం సాధించి భారత గౌరవాన్ని పెంచాడు. తమిళనాడుకి చెందిన 21 ఏళ్ల దివ్యాంగ అథ్లెట్ తంగవేలు మరియప్పన్ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. అత్యంత ప్రతిభ చూపించిన తంగవేలును యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభినందించారు. “నీ విజయ గాధ ఎంతో మందికి స్ఫూర్తి నిస్తుంది. నీ బంగారు పతకానికి హ్యాట్సాఫ్” అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి కంక్లూజన్ పాట చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక భారీ సెట్ లో అనుష్క, ప్రభాస్ ల మధ్య రొమాంటిక్ సాంగ్ ని దర్శక ధీరుడు రాజమౌళి షూట్ చేస్తున్నారు.
#MariyappanThangavelu ,ur win is an inspirational story for everyone.Hats off to you on your gold medal #Paralympics pic.twitter.com/LrTVr51j7m
— Prabhas (@PrabhasRaju) September 10, 2016