ప్రభాస్ కెరీర్ బాహుబలికి ముందు, తర్వాత అన్నంతగా మారిపోయింది. ఈ సినిమాతో యంగ్ రెబల్ స్టార్ కాస్త ఇండియన్ స్టార్ అయిపోయారు. అతనికి ఉన్న క్రేజ్ ని గుర్తించిన ప్రముఖ వాణిజ్య కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ లో వాలిపోతున్నారు. తమ కంపెనీ ప్రచార కర్తగా ఉండమని కోరుతున్నారు. అయితే ముద్దు వచ్చినప్పుడే చంక ఎక్కాలని చందంగా ప్రభాస్ భారీ మొత్తాన్ని అడుగుతున్నారు. ఒక సంవత్సరం బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడానికి పదికోట్లు ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు. బాలీవుడ్ హీరోలు 5 కోట్లు మాత్రమే తీసుకుంటారు… మీరెందుకు అంత డిమాండ్ చేస్తున్నారని ముంబై కంపెనీ ప్రతినిధులు ప్రశ్నించగా .. డార్లింగ్ అందుకు తగిన సమాధానం చెప్పిన్నట్లు తెలిసింది.
“బాలీవుడ్ హీరోలు కేవలం నార్త్ లోనే తెలుసు.. నాకు నార్త్, సౌత్ అన్ని ఏరియాల్లో అభిమానులున్నారు.. రేంజ్ తగ్గట్టే అడిగాను” అని చెప్పడంతో .. అది నిజమేనని భావించిన వారు ఎదురు ప్రశ్నించలేక పోయినట్లు సమాచారం. ‘బాహుబల-2’ విడుదలయిన తర్వాత ఒప్పందం చేసుకుందామని కొన్ని కంపెనీలు ఆలోచిస్తున్నాయి. మరి అప్పుడు రేంజ్ తో పాటు.. రేటు పెరగడం ఖాయం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.