ప్లాప్ సెంటిమెంట్ పై ప్రభాస్ స్పందన..!

  • August 21, 2019 / 08:05 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి2’ తరువాత చేస్తున్న మరో భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్నిఆగష్టు 30 న విడుదల చేస్తున్నారు. విడుదలకు మరో పది రోజులు మాత్రమే మిగిలుండడంతో ప్రమోషన్ల డోస్ పెంచారు నిర్మాతలు వంశీ, ప్రమోద్. ఇక ప్రమోషన్స్ లో గ్యాప్ లేకుండా పాల్గొంటున్నాడు ప్రభాస్. రెగ్యులర్ ప్రెస్ మీట్లలో పాల్గొంటూ మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వస్తున్నాడు. తాజాగా ఫెయిల్యూర్స్ పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు ప్రభాస్.

ప్రభాస్ మాట్లాడుతూ.. “ఫెయిల్యూర్స్ అనేవి ఎప్పుడో ఒకప్పుడు వస్తాయి. పెద్ద సినిమాలు చేసేటప్పుడు కూడా చాలా భయం ఉంటుంది. జాగ్రతగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలి. రెండేళ్ళ పాటు నేను ఈ సినిమా కోసం పనిచేశాను. అదే చిన్న సినిమాలు ఒప్పుకొని ఉంటే నాలుగు ప్రాజెక్టులు పూర్తి చేసి ఎక్కువ డబ్బులు సంపాదించుకునేవాడిని. కానీ ఓటమి భయం అప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఎంతో మంది సినిమా కోసం కష్టపడతారు. అలాగే పెద్ద సినిమాలకు ఇంకా ఎక్కువ మంది పనిచేస్తారు. ఖచ్చితంగా ఆ భయం అనేది ఎప్పుడైనా ఉంటుంది. ఓటమి భయం నాలో కూడా ఉంది’ అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus