‘సాహూ’ మూవీ లేటెస్ట్ అప్డేట్..!

  • February 5, 2019 / 10:40 AM IST

‘బాహుబలి’ తరువాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహూ” పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ కి ఇది రెండో చిత్రమే అయినా చాలా పకట్బందీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర మేకింగ్ వీడియో రిలీజ్ అయ్యే వరకూ ఈ చిత్రాన్ని లైట్ గానే తీసుకున్నారు. దీనికి ముఖ్య కారణం ‘బాహుబలి’… రాజమౌళి తో సినిమా చేసిన తరువాత… ఆ హీరోకి భారీ డిజాస్టర్ రావడం ఖాయం అనే సెంటిమెంట్ టాలీవుడ్ లో ఎప్పట్నుంచో ఉంది. అయితే ప్రభాస్ ఇప్పుడు కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు… బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అందుకే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ,తమిళ భాషల్లో కూడా తెరెక్కిస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి సంబందించిన ఓ వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ మన ఊహకి అందని రేంజ్ లో ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఈ చిత్రం కోసం డైరెక్టర్ సుజీత్… ఫేమస్ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ని రంగంలోకి దింపాడని టాక్ వినిపిస్తోంది.”ది వాల్” “ఐరన్ మ్యాన్” “ప్రిడేటర్స్” వంటి భారీ యాక్షన్ సినిమాలకు పని చేసిన యాక్షన్ డైరెక్టర్ బాబ్ బ్రౌన్ ని … ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చినట్లు ప్రముఖ రైటర్ కోన వెంకట్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేసాడు. ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని… ఆగష్టు 15 న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus