అభిమానుల కోసం ప్రభాస్ వద్దనుకున్నాడు!

టాలీవుడ్ బాహుబలిలో హీరోగా ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న ప్రభాస్ అదే క్రమంలో బాహుబలి వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటున్నాడు. అవేమిటంటే….ప్రస్తుతం బాహుబలి2లో నటిస్తున్న ప్రభాస్ చాల్ బిజీగా ఉన్నాడు. దాదాపుగా రోజుకి 16గంటలు పనిచేస్తూ బహుబలి కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నాడు. అంతేకాకుండా బాహుబలి తరువాత కానీ, ఏ సినిమా చేసేందుకు ఇష్ట పడటంలేదు. అదే క్రమంలో తన పెళ్లిని సైతం వాయిదా వేసుకున్నాడు. ఇంత చేసిన ప్రభాస్ ఆ సినిమా వల్ల దాదాపుగా 5.5కోట్లు నష్ట పోయాడని టాలీవుడ్ లో బలంగా వినిపిస్తున్న విషయం.

అదేలా అంటే…‘బాహుబలి 2’ సినిమాలో నటిస్తున్న ప్రభాస్ కు ఒక అంతర్జాతీయ కార్పోరేట్ కంపెనీ ఒకటి 5.5 కోట్లు ఆఫర్ చేసింది. ప్రభాస్ కు యూత్ లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆ ఇమేజ్‌ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఒక ప్రముఖ ఫిట్‌నెస్ సంస్థ ప్లాన్ చేసింది. తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకునేందుకు ప్రభాస్ నుఅడగడమే కాకుండా తమ ప్రొడక్ట్స్‌ని ఇండియాలో బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోట్ చేసి పెడితే దానికి ప్రతిఫలంగా ఐదున్నర కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చింది.

ఇందుకోసం ప్రభాస్ చేయవలసినది ఒక్కటే వివిధ రాష్ర్టాల్లో పర్యటించి తమ హెల్త్ ఫిట్నెస్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయాలని చెప్పినట్లు టాక్. అయితే ఈ సినిమా అయ్యే అంతవరకూ తాను ఆ యాడ్ చెయ్యలేని అని చెప్పాడు మన వాడు. కొన్నాళ్ళు ఆగమని సైతం చెప్పాడట. అవేమి వినిపించుకోకుండా ఆ సంస్థ మరో టాప్ హీరో గురించి సర్చ్ చేస్తున్నట్లు సమాచారం. పాపం ప్రభాస్!!!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus