Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ప్రభాస్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ‘స్పిరిట్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్’ అని పిలుస్తున్నారు. అయితే ఈ రేంజ్ ఇమేజ్‌ను కాపాడుకోవాలంటే ప్రభాస్ తన లుక్స్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సంక్రాంతికి విడుదలైన ‘ది రాజా సాబ్’ చిత్రానికి వస్తున్న ఫీడ్‌బ్యాక్ చూస్తుంటే, డార్లింగ్ తన వర్కింగ్ స్టైల్‌ను మార్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Prabhas

‘ది రాజా సాబ్’ సినిమాలో ప్రభాస్ కంటే ఎక్కువగా బాడీ డబుల్స్, ఫేషియల్ గ్రాఫిక్స్‌ను వాడారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కీ సీక్వెన్స్‌లలో ప్రభాస్ నేరుగా నటించకుండా టెక్నాలజీపై ఆధారపడటం వల్ల ఆయన ఒరిజినల్ యాక్టింగ్ మిస్ అయిందనే టాక్ నడుస్తోంది. నేషనల్ లెవల్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ నుంచి ప్రేక్షకులు 100 శాతం ఎఫర్ట్ ఆశిస్తారు. అందుకే ఈ బాడీ డబుల్స్ వివాదం ఆయన ఇమేజ్‌కు కొంత డ్యామేజ్ కలిగిస్తోందనేది వాస్తవం.

ఈ తరుణంలోనే ప్రభాస్ సందీప్ వంగా కాంబోలో ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ను ఒక పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా, ‘బీస్ట్ మోడ్’ లో చూపించే బాధ్యతను సందీప్ తీసుకున్నారు. ప్రభాస్ తన కెరీర్‌లోనే అత్యంత వైల్డ్‌గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఈ సినిమాతోనైనా ప్రభాస్ తన ఫిజిక్, స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో ఉన్న విమర్శలకు చెక్ పెడతారని అంతా ఆశిస్తున్నారు.

2027 మార్చి 5న విడుదల కానున్న ‘స్పిరిట్’ ప్రభాస్ కెరీర్‌కు చాలా కీలకం. ‘రాజా సాబ్’ విషయంలో చేసిన పొరపాట్లను ఇక్కడ రిపీట్ కాకుండా చూసుకోవడం డార్లింగ్ బాధ్యత. సందీప్ రెడ్డి వంగా లాంటి పర్ఫెక్షనిస్ట్ డైరెక్టర్ చేతిలో ప్రభాస్ ఉన్నారు కాబట్టి, కచ్చితంగా ఒక సాలిడ్ కమ్ బ్యాక్ ఉంటుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మరి ఈ బీస్ట్ మోడ్ అవతార్‌లో ప్రభాస్ బాక్సాఫీస్‌ను ఎలా శాసిస్తారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus