ప్రభాస్ ఫ్యాన్స్ కు మరింత కిక్ ఇచ్చేలా..!

  • July 3, 2019 / 05:28 PM IST

‘బాహుబలి’ వంటి భారీ బడ్జెట్ చిత్రంతో ప్రభాస్ క్రేజ్ ఓ రేంజ్లో పెరిగింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ప్రభాస్ కు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. దీంతో ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఆగష్టు 15 న విడుదల చేస్తున్నారు. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ని ‘యూ.వీ.క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇంతటి భారీ బడ్జెట్ చిత్రానికి ప్రమోషన్లు కనీసం నెల రోజుల నుండే మొదలు పెట్టాలి.

ఇందుకోసం ప్రభాస్ అండ్ టీం గట్టి ప్లాన్ వేస్తున్నారు. ఇప్పటికే ‘కొంచెం టచ్ లో ఉంటే చెబుతా’ వంటి షో కి ప్రభాస్ హాజరుకాబోతున్నాడనే వార్త ప్రచారంలో ఉంది. దీంతో పాటు తెలుగులో మంచి పాపులర్ అయిన ‘బిగ్ బాస్’ షో కి కూడా ప్రభాస్ హాజరు కాబోతున్నాడని తెలుస్తుంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్3’ జూలై 21 నుండీ మొదలుకానుందని సమాచారం. ఈ షో ద్వారా ‘సాహో’ చిత్రం ప్రమోషన్స్ చేసుకోవాలని ప్రభాస్ తో పాటు చిత్ర యూనిట్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus