అనుష్క భాగమతి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్న ప్రభాస్

  • June 29, 2017 / 02:12 PM IST

బాహుబలి తర్వాత అనుష్క చేస్తున్న ఏకైక సినిమా భాగమతి. పిల్ల జ‌మీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. యూవీ క్రియేష‌న్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అరుంధతి, రుద్రమదేవి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల తర్వాత అనుష్క చేస్తున్న ఈ సినిమాలో ఆమె క్యారక్టర్, లుక్ కి సంబంధించిన ఒక పోస్టర్ కూడా బయటికి రాలేదు. ఆమె లుక్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

వారి కోసం ఓ గుడ్ న్యూస్ .. భాగమతి మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని జూన్ 30న ప్ర‌భాస్ విడుదల చేయనున్నారు. ప్రస్తుతం సాహో షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ తమ ఫ్రెండ్స్ వంశీ, ప్రమోద్ కోసం ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నట్లు తెలిసింది. యువ నటుడు ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఉన్ని ముకుంద‌న్ కీలక రోల్ పోషించారు. తెలుగులోనే కాకుండా త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లోను ఈ మూవీ ఆగ‌స్ట్ 11న  రిలీజ్ కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus