ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా మీద మాత్రమే దృష్టి పెట్టారు. బాహుబలి తర్వాత తనపై పెరిగిన అంచనాలకు ఏ మాత్రం సినిమా తగ్గకుండా ఉండాలని కష్టపడుతున్నారు. ప్రొడక్షన్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఎక్కువసమయం పట్టేట్టు ఉందని తెలిసింది. అందుకే జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో 20 వ చిత్రాన్ని మొదలు పెట్టడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది 1970 నాటి ఫాంటసీ కథని తెలిసింది. అందుకోసం ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ సెట్స్ డిజైన్స్ చేస్తున్నారు. అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్టింగ్స్ వేస్తున్నారు. దీనికి 2 కోట్ల దాకా ఖర్చు చేయనున్నారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి.
ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుందని ఇప్పటివరకు వినిపిస్తున్నమాట. అయితే తాజాగా ఆమె స్థానాన్ని రకుల్ ప్రీత్ సింగ్ కైవశం చేసుకుందని చెప్పుకుంటున్నారు. పూజా హెగ్డేకి చేతినిండా సినిమాలు ఉన్నాయి. అందుకే డేట్స్ సర్దుబాటు చేయలేక ప్రభాస్ సినిమాని వదులుకున్నట్టు సమాచారం. ఊహించని అవకాశం రావడంతో రకుల్ ఆనందంలో ఉంది. యువీ క్రియేషన్స్ తో పాటు కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది మ్యూజిక్ అందించనున్నారు. ఈ చిత్రం నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.