అనుష్క, భాగమతి టీమ్ కి గుడ్ లక్ చెప్పిన ప్రభాస్

  • January 9, 2018 / 05:48 AM IST

బాహుబలి చిత్రం తర్వాత స్వీటీ అనుష్క చేసిన ఏకైక చిత్రం భాగమతి. ఇందుకోసం ఆమె ఏడాది పాటు కష్టపడింది. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు ప్రభాస్ అనుష్క పై ప్రశంసలు గుప్పించారు. “ప్రతి చిత్రంలోనూ కొత్తగా కనిపించడంలో, అటువంటి పాత్రలను ఎంచుకోవడంలో అనుష్క ఎప్పుడూ ముందు ఉంటుంది.” అని పోస్ట్ చేశారు. నిన్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. ట్రైలర్‌ విడుదలైన మూడు గంటల్లోనే 20 లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయి. ఇందులో అనుష్కని చూసిన ప్రతిఒక్కరూ అరుంధతి, రుద్రమదేవి, దేవసేన.. మాదిరిగా భాగమతి క్యారెక్టర్ అనుష్కకి మంచి పేరు తెస్తుందని అంటున్నారు.

ఈ ట్రైలర్ చూసిన ప్రభాస్ తన స్పందనను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “ట్రూ హార్డ్‌వర్క్‌, డెడికేషన్‌ . స్వీటీకి, అశోక్‌కి, యూవీ క్రియేషన్స్‌ సంస్థకి గుడ్‌లక్‌” అని ప్రభాస్‌ పోస్ట్‌ చేశారు. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వం వహించిన భాగమతి’ చిత్రంలో ఉన్ని ముకుందన్‌, జయరాం, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. థమన్ సంగీతమందించారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన ఈ సినిమా జనవరి 26న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus