నాలుగు భాషల్లో ప్రభాస్, సుజీత్ సినిమా టీజర్

  • April 19, 2017 / 09:55 AM IST

ప్రభాస్ అభిమానులకు శుభవార్త. యంగ్ రెబల్ స్టార్ బాహుబలి సినిమా తర్వాత నటిస్తున్న మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యాయి. ఈ సినిమా టీజర్ ను నాలుగు భాషల్లో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. బాహుబలి కంక్లూజన్ తర్వాత ప్రభాస్  డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ ఫిల్మ్ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ చిత్ర టీజర్ ని బాహుబలి 2 ప్రదర్శితమయ్యే థియేటర్లలో రిలీజ్ చేయాలనీ నిర్మాతలు భావించారు. అందుకు తగినట్లుగా ప్రభాస్, సుజీత్ శ్రమించారు. కొన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేశారు. ఆ టీజర్ కి ఇప్పుడు మెరుగులు దిద్దుతున్నారు.

ప్రభాస్ 19 మూవీ టైటిల్ ని ఫస్ట్ లుక్ ని ఈనెల 23 న రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది. ఇక టీజర్ ని తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఏప్రిల్ 28 న అంటే బాహుబలి కంక్లూజన్ రిలీజ్ అయ్యే రోజు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. సో ఆ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కి రెండు పండుగలు అన్నమాట. ఒక హీరో తాను నటించిన సినిమా రిలీజ్ రోజే, అతను నటించే నెక్స్ట్ సినిమా టీజర్ రిలీజ్ కావడం ఇదే తొలిసారి. ఈ విధంగా ప్రభాస్ 19 సినిమా తొలి రికార్డ్ ని నెలకొల్పింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus