ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవ చాలా కాలం తర్వాత నయనతారతో తన ప్రేమ గురించి నోరు విప్పాడు. వీరిద్దరూ కొంతకాలం క్రితం గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇందుకోసం నయన మతం కూడా మార్చుకుంది. కానీ ఆఖరి సమయంలో ఇద్దరు విడిపోయారు. ఒకరి గురించి మరొకరు మాట్లాడటం కూడా ఆపేసారు. ప్రభుదేవ నటించి, నిర్మించిన ‘అభినేత్రి’ చిత్రం అక్టోబర్ 7న విడుదలవుతుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన పలు వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.
” సృష్టిలో అందరికీ ఏదో ఒక రూపంలో బాధలు వెంటాడుతూనే ఉంటాయి. సంపూర్ణ ఆనందంతో ఉన్న వ్యక్తి ఎవ్వరూ ఉండరు. అలాంటి వ్యక్తి ఎదురైతే, తప్పకుండా అతనికి సలాం కొట్టి అతని దగ్గర సహాయకుడిగా మారిపోతాను” అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడారు. ‘ప్రేమకథలన్నీ సుఖాంతం కావు. నాదీ అంతే. ప్రేమలో పడడం, అందులో విఫలం అవ్వడం కూడా ప్రేమలో ఒక భాగంగానే చూస్తాను. అయ్యిందేదో అయ్యింది. దాని గురించి నేనేం బాధపడడం లేదు’ అని సినీ నృత్య దేవుడు చెప్పడం చూస్తుంటే ఆమెను ఇంకా మరిచిపోలేనట్టుగా అనిపిస్తోంది.