అరెస్ట్ అవ్వడం ఇష్టం లేక అజ్ణాతవాసంలోకి

Advertisement

మన భారతీయ సంస్కృతితో సంబంధం లేకపోయినా చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా అందరూ ఆర్భాటంగా జరుపుకొనే పండుగ ‘నూతన సంవత్సరం వేడుకలు’. పీతలా తాగి, బాతులా ఒక రోజంతా పడుకోవడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశ్యం అన్నట్లుగా యువత తమకు అందుబాటులో ఉన్న మద్యాన్ని తాగేస్తుంటారు. తాగడం, ఊగడం అనేది పర్సనల్ మేటర్ కాబట్టి ఎవరూ ఎవర్నీ ఆ విషయమై ప్రశ్నించలేరు. కానీ.. తాగి డ్రైవ్ చేయకండి అని మాత్రం గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలన్నీ మొట్టుకుంటూనే ఉన్నాయి. అయినా ఎవరూ వినరు. తాగి డ్రైవ్ చేయడానికి గొప్పగా భావించి కొందరు సురక్షితంగా ఇంటికి చేరుతుండగా.. ఇంకొందరు మాత్రం యాక్సిడెంట్ లు చేసి వారి ప్రాణాలు రిస్క్ చేయడమే కాక అభాగ్యుల ప్రాణాలను కూడా తీస్తున్నారు.

అందుకే.. జనవరి 1 అర్ధరాత్రి నుంచి మద్యం తాగి డ్రైవ్ చేయకూడదు అంటూ పోలీసులు చెక్ పోస్ట్ లు నిర్వహించి దొరికినవారిని దొరికినట్లుగా అరెస్ట్ చేయడం, వారి వాహనాలను సీజ్ చేయడం మొదలెట్టారు. అలా ఒక చెక్ పోస్ట్ లో పాపులర్ యాంకర్ ప్రదీప్ కూడా దొరికిపోయాడు. వెంటనే వేరే ఫ్రెండ్ బండి తెప్పించుకొని వెళ్ళిపోయినప్పటికీ.. పోలీసులు అతడిపై చార్జ్ షీట్ ఫైల్ చేశారు. అయితే.. విచిత్రంగా ప్రదీప్ గత రెండ్రోజులుగా కనిపించకుండా తిరుగుతున్నాడు. ఒక డ్రంక్ & డ్రైవ్ కేసు విషయంలో ప్రదీప్ ఇలా తప్పించుకొని తిరుగుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయాక ప్రదీప్ ఇంత విచిత్రంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడనే విషయం మాత్రం ఎవరికీ అర్ధం కావడం లేదు. ఇష్యూ మరింత సీరియస్ అవ్వకముందే ప్రదీప్ పోలీసులకి సహరిస్తే బెటారేమో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus