ప్రగ్యా డెడికేషన్ చూసి నక్షత్రం టీం షాక్

  • August 2, 2017 / 12:17 PM IST

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న “ఆచారి అమెరికా యాత్ర” షూటింగ్ లో మంచు విష్ణు తీవ్రంగా గాయపడ్డాడన్న విషయం తెలిసిందే. అయితే.. మంచు విష్ణుతోపాటు అతడి సరసన కథానాయికగా నటిస్తున్న ప్రగ్యాజైస్వాల్ కూడా గాయాలపాలైంది. మంచు విష్ణు అంత కాకపోయినా పగ్యకు కూడా దెబ్బలు గట్టిగానే తగిలాయి. అదృష్టం బాగుండి మొహం మీద పెద్దగా గాయాలవ్వలేదు కానీ.. భుజం, వీపు భాగాల్లో దెబ్బలు కాస్త గట్టిగా తగిలాయి.

ఆ గాయాలను సైతం లెక్క చేయకుండా.. ఈ శుక్రవారం విడుదలవుతున్న తన తాజా చిత్రం “నక్షత్రం” ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ప్రగ్యను చూసి టీం మెంబర్స్ తోపాటు ఆమె పర్సనల్ స్టాఫ్ కూడా షాక్ అవుతున్నారంట. ఇకపోతే.. ప్రగ్యా నటించిన మరో చిత్రం “జయ జానకి నాయక” ఆగస్ట్ 11న విడుదలవుతోంది. ఈ రెండు సినిమాలు యావరేజ్ గా హిట్టైనా అమ్మడికి మరో నాలుగు ఆఫర్లు వెతుక్కుంటూ రావడం ఖాయం. మరి అమ్మడు చూపిస్తున్న డెడికేషన్ కి ఈమాత్రం ఆఫర్లు రావడం సబబే కదా!


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus